ఆలయ భూముల విషయంలో వివాదం

ABN , First Publish Date - 2021-08-09T17:40:15+05:30 IST

ప్రకాశం: ఆలయ భూముల విషయంలో చెలరేగిన వివాదం.. చివరికి ఉద్రిక్తతకు దారితీసింది. వేటపాలెం మండలం రావూరు శ్రీ కనకనాగరపమ్మ అమ్మవారి మాన్యం భూముల విషయంలో ఈ వివాదం నెలకొంది.

ఆలయ భూముల విషయంలో వివాదం

ప్రకాశం: ఆలయ భూముల విషయంలో చెలరేగిన వివాదం.. చివరికి ఉద్రిక్తతకు దారితీసింది. వేటపాలెం మండలం రావూరు శ్రీ కనకనాగరపమ్మ అమ్మవారి మాన్యం భూముల విషయంలో ఈ వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రావూరు కనకనాగరపమ్మ అమ్మవారి ఆలయానికి సంభందించిన 26 ఎకరాల భూమి.. చిన్నగంజాం మండలం సంతరావూరు పరిధిలో ఉంది. ఈ భూమిని కౌలుకు ఇచ్చేందుకు గాను.. అధికారులు వేలం పాట నిర్వహించేందుకు వచ్చారు. అయితే ఆలయానికి సంబంధించిన ఎక్కువ భూములు సంతరావూరులో ఉన్నందున.. కమిటీలో తమకు ప్రాధాన్యత ఇచ్చి, చైర్మన్ పదవి ఇవ్వాలంటూ సంతరావూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గతంలో ఈ రెండు గ్రామాలు ఒకే మండలంలో ఉండేవి.

Updated Date - 2021-08-09T17:40:15+05:30 IST