ఆలయ అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2020-11-30T05:25:23+05:30 IST

ఆలయ అభివృద్ధికి కృషి

ఆలయ అభివృద్ధికి కృషి
ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న శ్రీకాంత్‌ చక్రవర్తి

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దాతృత్వం.. రూ.లక్షల్లో విరాళం

  • కొడంగల్‌: కేశవస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు పట్టణానికి చెందిన కౌడీడ్‌ సభ్యులు తెలిపారు. దివంగత కౌడీడ్‌ వామనరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శ్రీకాంత్‌చక్రవర్తి కొడంగల్‌లోని కేశవస్వామి ఆలయ అభివృద్ధి కోసం ముందుకు వచ్చారు. ఆదివారం ఆయన ఆలయ అభివృద్ధి పనులు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3లక్షల వ్యయంతో ప్రాకారం పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. పురాతన ఆలయంగా పేరొందిన కేశవస్వామి ఆలయం మహిమాన్వితమైందన్నారు. సంఘ సేవకుడు, కేశవస్వామి భక్తుడు మురారి వశిష్ట ఆధ్వర్యంలో పనులను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆలయం ఆవరణలో వంటశాల నిర్మాణం, ప్రహరీ, రంగులు తదితర పనులను పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. మండల పరిధిలోని చిన్ననందిగామ గ్రామంలో ఆలయ నిర్మాణానికి రూ.50వేలు సహాయంగా అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మురారవ శిష్ట, కౌడీడ్‌ కుటుంబ సభ్యులు హన్మంత్‌రావు, విజయలక్ష్మి, చారులత, శ్రీహరి, వీఆర్వో రాంరెడ్డి, ఆలయ అర్చకులు, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T05:25:23+05:30 IST