Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనారోగ్యంతో TDP మహిళా నాయకురాలు కన్నుమూత

చిత్తూరు జిల్లా/వెదురుకుప్పం : కార్వేటినగరం మండలం ఆర్కేవీబీ పేటకు చెందిన టీడీపీ నాయకురాలు రాణెమ్మ (54) అనారోగ్యంతో మృతి చెందింది.  పలువురు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించారు. పార్టీకి ఆమె చేసిన సేవలను కొనియాడారు. నివాళులర్పించిన వారిలో  తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు నగలపాటి నాగేశ్వర రాజు, బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు చెంగల్రాయయాదవ్‌, మాజీ సర్పంచ్‌ వెంకటరెడ్డి, ఎస్సీ సెల్‌ కార్యదర్శి శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బీగాల రమేష్‌ ఉన్నారు.

Advertisement
Advertisement