ఎస్సీల పొట్ట కొడతారా?: బాబు

ABN , First Publish Date - 2020-12-03T08:45:00+05:30 IST

ఎస్సీలకు న్యాయం చేయాలనుకుంటే.. చట్టం లేకపోయి నా వారి భూములను వారికే ఇవ్వొచ్చుగా? లాభం కోసమే అయితే పేదల స్వాధీనంలోని

ఎస్సీల పొట్ట కొడతారా?: బాబు

అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘ఎస్సీలకు న్యాయం చేయాలనుకుంటే.. చట్టం లేకపోయి నా వారి భూములను వారికే ఇవ్వొచ్చుగా? లాభం కోసమే అయితే పేదల స్వాధీనంలోని భూములెందుకు ఇవ్వడం? మీ సొంత భూములే ఇచ్చి ఆ లాభాలేవో మీరే పొందవచ్చుగా! పేదలు.. మరీ ము ఖ్యంగా ఎస్సీల పొట్టకొట్టడమేంటి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదల దగ్గరున్న భూములను లాక్కునేలా అసైన్‌మెంట్‌ యాక్టుకు సవరణలు చేసిందని.. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ బుధవారమిక్కడ టీడీఎల్పీ కార్యాలయం నుంచి ఆయన వీడియో సందేశమిచ్చారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని స్పీకర్‌ కనీసం తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. అవతలి వైపున 10మందికి అవకాశమిచ్చి, వారితో తనను తిట్టిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.


రాష్ట్రంపై పెనుభారం వేయబోతున్నారని చంద్రబాబు ఆవేద న వ్యక్తంచేశారు. ‘పీపీఏలపై విమర్శలు చేసిన పెద్ద మనుషులు.. కొత్త వాటికి ఎక్కడా లేని విధంగా విపరీతంగా ఇన్సెంటివ్‌లు ఇచ్చారు. అవి ఇచ్చిన విధానం కూడా చాలా దారుణం’ అని చెప్పారు. ఇదిలావుంటే, అమరావతి పరిరక్షణ సమితి ఆందోళనలు 350లు పూర్తిచేసుకొన్న సందర్భంగా బుధవారం రాజధానిలో తెలుగు మహిళల బృందం పర్యటించింది. అనంతరం తెలుగు మహిళ అఽధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో బృందం చంద్రబాబును కలిసి, పర్యటన విషయాలను వివరించింది.

Updated Date - 2020-12-03T08:45:00+05:30 IST