Advertisement
Advertisement
Abn logo
Advertisement

జనవరిలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు

కాళ్ళ, డిసెంబరు 7: ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు జనవరి 6, 7, 8 తేదీలలో నిర్వహిస్తున్నట్లు పరిషత్‌ భీమవరం పాలకవర్గ మండలి చైర్మన్‌ కేశిరాజు శ్రీనివాస్‌ (గజల్‌ శ్రీనివాస్‌) తెలిపారు. పెదఅమిరం వెస్ట్‌బెర్రీ హైస్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించే తెలుగు సంబరాల వివరాలు మంగళవారం ఆయన తెలిపారు. 13 శాఖల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించేందు కు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందన్నారు. జనవరి 3న భీమవరం వీరమ్మపార్క్‌ నుంచి జువ్వలపాలెం రోడ్డులోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వరకు తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ హరిచంద్రన్‌ బిశ్వభూషణ్‌, మిజోరాం గవర్నర్‌ కె.హరిబాబు, కోన రఘుపతి, మండలి బుద్ద ప్రసాద్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు పా ల్గొంటారని తెలిపారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఆహ్వానించామన్నారు.

Advertisement
Advertisement