తెలుగు తేజం ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-05-29T06:14:43+05:30 IST

తెలుగుజాతి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు పిలుపునిచ్చారు.

తెలుగు తేజం ఎన్టీఆర్‌
చోడవరంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజు, తదితరులు

  వాడవాడలా ఘనంగా జయంతి 

 మహనీయుని విగ్రహాల వద్ద టీడీపీ శ్రేణుల నివాళి

రాష్ట్రానికి అందించిన సేవలను కీర్తించిన వక్తలు 

చోడవరం, మే 28 : తెలుగుజాతి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని మాజీ ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు పిలుపునిచ్చారు. చోడవరంలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతిని శనివారం నిర్వహించి మాట్లాడారు.  నాయకులు గూనూరు అచ్చిబాబు, పట్టణ టీడీపీ నాయకులు దేవరపల్లి వెంకట అప్పారావు, ముడుసు గోవింద్‌, రేవళ్లు త్రినాఽథ్‌, మెం బర్‌ శ్రీను  తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, మహానాడు ప్రాంగణం వద్ద నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళుల ర్పిం చారు. మాజీ జడ్పీటీసీ కనిశెట్టి మత్య్సరాజు, నాయకులు పూతి కోటేశ్వరరావు, దొడ్డి కిషోర్‌, ముత్యాలనాయుడు, కర్రి కోటేశ్వరరావు, అప్పలనాయుడు, బం డారు రామారావు. మెంబర్‌ వెంకటరావు పాల్గొన్నారు. 

బుచ్చెయ్యపేట : ఎన్టీఆర్‌ జయంతిని మండలంలో వాడవాడలా నిర్వహించారు. బంగారుమెట్ట జంక్షన్‌లో ఉన్న విగ్రహానికి పట్టణ టీడీపీ అధ్యక్షుడు దొండా నరేష్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.  నాయకులు తమరాన దాసు, దొండా శ్రీను, సాయం శేషు, దొండా రమేష్‌, బావిసెట్టి నూకరాజు, దొండా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

రావికమతం : ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా రావికమతంలోని విశాఖ డెయిరీ పాలసరఫరా కేంద్రం వద్ద, కొత్తకోటలో ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ రాజు పూల మాలలు వేసి నివాళులర్పించారు.   పార్టీ మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడు, ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ, ఉప సర్పంచ్‌ గంజి మోదునాయుడు, నాగేశ్వరావు, పి.సత్యనారాయణ, ఉగ్గిన శ్రీను, కోట సత్యనారాయణ పాల్గొన్నారు.

రోలుగుంట : గ్రామ గ్రామాన ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిండుగొండలో మాజీ ఎమ్మెల్యే రాజు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మండల మండల అధ్య క్షుడు గుములూరు చంద్రమౌళి, ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ, ధర్మరాజు, మాజీ సర్పంచ్‌ సుర్ల బాబులునాయుడు తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నం నియోజకవర్గంలో... 

నర్సీపట్నం/అర్బన్‌ : మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు శతజయంతి వేడుకలను నర్సీపట్నం టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్లు ధనిమిరెడ్డి మధు, మూలపర్తి రామరాజు, డబ్బీరు శ్రీకాంత్‌, మాజీ కౌన్సిలర్లు రావాడ నాయుడు, దన్నిన రాంబాబు, పైల గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ధర్మసాగరంలో జడ్పీటీసీ సుకల రమణమ్మ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉప సర్పంచ్‌ వెంకటలక్ష్మి, గ్రామ టీడీపీ అధ్యక్షుడు సత్తిబాబు పాల్గొన్నారు.

గొలుగొండ/కృష్ణాదేవిపేట : ఎన్టీఆర్‌ జయంతిని మం డలంలోని టీడీపీ శ్రేణులు ఘనంగా జరు పుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు ఆధ్వర్యంలో గొలుగొండలో ఎన్టీఆర్‌ చిత్ర పటానికి ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి నివా ళులర్పించారు. అలాగే,  కొత్తమల్లంపేట, కొమిర, పాకలపాడు, ఏటిగైరంపేట, కొత్తఎల్లవరం, సీహెచ్‌.నాగాపురం,  ఏ.ఎల్‌పురం, కొంగశింగి తదితర గ్రామాల్లో  జరిగిన వేడుకల్లో మాజీ సర్పంచ్‌ పరవాడ అప్పలనాయుడు, నాయకులు గొంపవాసు , బొడ్డు జెమీలు,  వరహాలబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు.

మాకవరపాలెం : మండలంలోని మాకవరపా లెం, తామరం, రామన్నపాలెం, బయ్యవరం, తూటిపాల,లచ్చన్నపాలెం, తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ జయంతిని జరిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్‌.వై.పాత్రుడు తదితరులు మాట్లా డుతూ ఎన్టీఆర్‌ సేవలను కీర్తించారు.  శెట్టిపాలెం సర్పంచ్‌ అల్లు రామునాయుడు, నాయకులు కోసూరు శ్రీను, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

నాతవరం : ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మాజీ జడ్పీ టీసీ కరక సత్యనారాయణ నాతవరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. వివిధ గ్రామాల్లో జరిగిన వేడుకల్లో పార్టీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, మాజీ ఎంపీపీ ఎన్‌.విజయ్‌కుమార్‌ ఇటంశెట్టి సీతారామ్మూర్తి, టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడు జీరెడ్డి రాజుబాబు, మాజీ ఎంపీటీసీ బంగారు సూరిబాబు పాల్గొన్నారు. ఇదిలావుంటే, గుమ్మిడి గొండలో మాజీ సర్పంచ్‌ సుర్ల వెంకటరమణ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు చింతకాయల ప్రశాంత్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు మరింత ఘనంగా జరిగాయి. 

మాడుగుల నియోజకవర్గంలో..

మాడుగుల : ఎన్టీఆర్‌ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. మాడుగుల బస్టాండ్‌ ఆవరణలో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పుప్పాల అప్పలరాజు, మండల శాఖ అధ్య క్షుడు అద్దెపల్లి జగ్గారావు పూలమాల వేసి నివాళుల ర్పించారు. నాయకులు లెక్కల కాశిబాబు, సూర్యనారాయణరాజు, తుడుం నూకరాజు, మూర్తి, నానాజీ, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. 

దేవరాపల్లి : గ్రామ గ్రామాన ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.  రైవాడ మూడు రోడ్లు జంక్షన్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు వారాధి అప్పారావు, రమణ, దాలిబోయిన నాగరాజు, వారాది కృష్ణ, ఆబోతు నాయుడు, చల్లాశ్రీను, రామకృష్ణ, దుక్కాసత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన అన్నసమారాధనకు పార్టీ నాయకుడు పైలా ప్రసాదరావు ఆర్థిక సహాయం అందజేశారు. 

చీడికాడ : ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా  మాజీ ఎంపీపీ పోతల రమణమ్మ, టీడీపీ నాయకులు చీడికాడలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ జడ్పీటీసీ జి.సత్యనా రాయణరాజు, నాయకులు గండి ముసలినాయుడు, రొంగలి రామునాయుడు, గాలి బాలకృష్ణ, బీళ్ల కోటే శ్వరరావు, పోతుబంతి రాజు, పెద్ది వెంకటరమణ, నడుపూరి ముత్యాలు, బొడ్డు గౌరునాయుడు, అనప గడ్డి నానాజీ  పాల్గొన్నారు. 

కె.కోటపాడు : మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రానికి, దేశానికి ఆయన అందించిన సేవలను కీర్తించారు. 

Updated Date - 2022-05-29T06:14:43+05:30 IST