Abn logo
Jul 12 2020 @ 15:37PM

కజకిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

హైదరాబాద్: కజకిస్థాన్‌ ఎయిర్‌పోర్టులో  తెలు గు రాష్ట్రాలకు చెందిన 230 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు.  తమ స్వస్థలాలకు వచ్చేందుకు బుక్‌ చేసుకున్న విమానం రాకపోవడంతో వీరంతా రెండు రోజులుగా ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమను స్వదేశం రప్పించేందుకు సహకరించాలని టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు ఫోన్‌లో విన్నవించారు. తమను  ఇండియాకు తీసుకెళ్తామని ఓ ఏజెంట్‌  ఒక్కొక్కరి నుంచి రూ.45వేలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి జైశంకర్‌కు నామ నాగేశ్వరరావు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement