కిర్గిస్థాన్‌లో తెలుగు విద్యార్థుల పడిగాపులు

ABN , First Publish Date - 2020-07-11T08:47:43+05:30 IST

తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది వైద్య విద్యార్థులు కిర్గిస్థాన్‌లో చిక్కుకుపోయారు.

కిర్గిస్థాన్‌లో తెలుగు విద్యార్థుల పడిగాపులు

పెనుగంచిప్రోలు, జూలై 10: తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది వైద్య విద్యార్థులు కిర్గిస్థాన్‌లో చిక్కుకుపోయారు. వారంతా కిర్గిస్థాన్‌ రాజధాని బిష్‌కేక్‌ సమీపంలోని ఏషియన్‌ మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ చదువుతున్నారు. వీరు స్వదేశానికి వచ్చేందుకు వారం క్రితమే ఒక్కొక్కరు రూ.45 వేలు చెల్లించి విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 6 గంటలకు మానస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి హై దరాబాద్‌కు విమానం బయలుదేరాల్సి ఉంది. షెడ్యూల్‌ సమయం దాటి గంటలు గడిచినా విమానం రాకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే గంటకో మాట చెబుతున్నారని పెనుగంచిప్రోలుకు చెందిన చాట్ల వసంత్‌, శివరాంబొట్ల వెంకటేశ్‌ ఫోన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-07-11T08:47:43+05:30 IST