తెలుగును రెండో అధికార భాషగా ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-01-25T05:22:57+05:30 IST

ఉత్తరాది తెలుగు రాష్ట్రాల్లోని బడిలో, గుడి లో, రాబడిలో ఏలుబడిలో తెలుగుభాషను తప్పని సరిచేస్తూ తెలుగు రాష్ట్రాల పలకులు చట్టాలు చేయాలని ద్రవిడనాడు జాతీయ అధ్య క్షుడు కిన్నెర సిద్దార్థ అన్నారు.

తెలుగును రెండో అధికార భాషగా ప్రకటించాలి

కమ్మర్‌పల్లి, జనవరి 24: ఉత్తరాది తెలుగు రాష్ట్రాల్లోని బడిలో, గుడి లో, రాబడిలో ఏలుబడిలో తెలుగుభాషను తప్పని సరిచేస్తూ తెలుగు రాష్ట్రాల పలకులు చట్టాలు చేయాలని ద్రవిడనాడు జాతీయ అధ్య క్షుడు కిన్నెర సిద్దార్థ అన్నారు. ద్రవిడనాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్వాప్త తెలుగుజాతి ఆత్మగౌరయాత్రలో భాగంగా ఆదివారం కమ్మర్‌పల్లి మండలం హసాకొత్తూర్‌ చేరుకున్న ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుభాషకు జరిగినంత అన్యాయం మరే భాషకు జరగలేదన్నారు. రాజులకాలంలో పాకృతం, పాళీ, సంస్కృత భాషలుం డగా ముస్లింలపాలనలో పార్షి, ఉర్దూ, బ్రిటీష్‌ పాలనలో ఇంగ్లీషు అధికార భాషలుగా నేటికీ కొనసాగుతున్నాయన్నారు. నేటికి తెలుగు ప్రజల వాడుక భాష అయిన తెలుగు భాషా అధికారిక భాషగా లేకపోవడం శోచనీయమన్నారు. తెలుగు భాషను అన్నిరంగాల్లో అధికారిక భాషగా చేయాలని కోరుతూ తెలుగు జాతిని చైతన్య పర్చే నిమిత్తం రథయాత్ర చేపడుతన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్కపల్లి రాంచందర్‌,  ద్రావిడ కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు డోలక్‌ యాదగిరి, రాష్ట్రకార్యనిర్వహక అధ్యక్షుడు అల్లురి సావిత్రి ముదిరాజ్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:22:57+05:30 IST