ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-02-27T20:31:03+05:30 IST

ఆస్ట్రేలియాలో జిల్లాకు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అడిలైడ్ స్టేట్ సల్స్ బరీలోని ఓ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీష్ బాబు

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి

ప్రకాశం: ఆస్ట్రేలియాలో జిల్లాకు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అడిలైడ్ స్టేట్ సల్స్ బరీలోని ఓ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీష్ బాబుగా తెలుస్తోంది. గత ఆరేళ్లుగా ఉద్యోగ నిమిత్తం హరీష్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. హరీష్ మృతిపై ఆస్ట్రేలియా పోలీసులు విచారణ చేపట్టారు. హరీష్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ఆస్ట్రేలియా పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా హరీష్‌ మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2021-02-27T20:31:03+05:30 IST