కాపాడండి

ABN , First Publish Date - 2020-03-28T10:31:16+05:30 IST

తమను ఆంధ్రాకు తరలించి అక్కడే ఐసొలేషన్‌లో ఉంచాలని కాశీ యాత్రకు వెళ్లిన జిల్లావాసులు ప్రభు త్వానికి మొర పెట్టుకుంటున్నారు. ఈ నెల 15న ఏలూరు నుంచి 20 మంది...

కాపాడండి

  • కాశీలో చిక్కుకున్న 30 మంది జిల్లావాసులు
  • తీసుకురావాలని కుటుంబ సభ్యుల వేడుకోలు

కొయ్యలగూడెం/ఏలూరు రూరల్‌, మార్చి 27 : తమను ఆంధ్రాకు తరలించి అక్కడే ఐసొలేషన్‌లో ఉంచాలని కాశీ యాత్రకు వెళ్లిన జిల్లావాసులు ప్రభు త్వానికి మొర పెట్టుకుంటున్నారు. ఈ నెల 15న ఏలూరు నుంచి 20 మంది, కొయ్యలగూడెం మండలం గవరవరం నుంచి పది మంది భక్తులు కాశీ వెళ్లారు. ఆ తరువాత కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వీరంతా కాశీలోనే ఇరుక్కుపోయారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారు ఎక్కువ మంది ఉండడంతో ఆరోగ్య సమస్యలపై ఆందోళన చెందుతున్నారు. తమను ఆంధ్రకు తరలించి ఐసొలేషన్‌లో ఉంచాలని కోరుతున్నారు. అక్కడికి వెళ్లిన భక్తులలో ఒకరైన తణుకు సోమరాజు మాట్లాడుతూ తాము బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావుకు ఫోన్‌ చేసి తమ కష్టాలను తెలిపామని, ఆయన స్పందించి వారణాసి కలెక్టర్‌ రాకేష్‌తో మాట్లాడారని తెలిపారు శుక్రవారం మధ్యాహ్నానికి తమకు ఆహారం అందించారని, శనివారం రేషన్‌ సరుకులు, గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తా మని స్థానిక అధికారులు చెప్పారన్నారు. ఏలూరు ఆర్‌ఆర్‌ పేటకు చెందిన మీనంబాకం ఆనంద్‌, ఆయన కుటుంబ సభ్యులు 12 మంది, ఏలూరు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన మరో 18 మంది ఈ నెల కాశీ బయలుదేరి వెళ్లి అక్కడ ఇరుక్కుపోయారు. ఆనంద్‌ కుమారుడు దుర్గాప్ర సాద్‌, తన తండ్రి, బంధువులను కాశీ నుంచి ఎలాగైనా స్వస్థలాలకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. 


Updated Date - 2020-03-28T10:31:16+05:30 IST