200 రోజుల అమరావతి రైతుల నిరసనకు.. కువైట్‌లోని ప్రవా‌సాంధ్రుల మ‌ద్ద‌తు

ABN , First Publish Date - 2020-07-04T18:41:57+05:30 IST

గ‌త 200 రోజల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న నిరసనకి కువైట్‌లోని ప్ర‌సాంధ్రులు త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. ఎంతో మంది రైతులు త‌మ భూముల‌ను త్యాగం చేసి రాజధాని నిర్మాణానికి ఇచ్చార‌ని ఈ సంద‌ర్భంగా ఎన్నారైలు గుర్తు చేశారు.

200 రోజుల అమరావతి రైతుల నిరసనకు.. కువైట్‌లోని ప్రవా‌సాంధ్రుల మ‌ద్ద‌తు

కువైట్ సిటీ: గ‌త 200 రోజల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న నిరసనకి కువైట్‌లోని ప్ర‌సాంధ్రులు త‌మ మ‌ద్ద‌తు తెలిపారు. ఎంతో మంది రైతులు త‌మ భూముల‌ను త్యాగం చేసి రాజధాని నిర్మాణానికి ఇచ్చార‌ని ఈ సంద‌ర్భంగా ఎన్నారైలు గుర్తు చేశారు. అలాంటి అన్న‌దాత త్యాగాల‌ను వృధా చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ రాజ‌ధాని త‌ర‌లింపుకు పూనుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌వాసులు ప్ర‌శ్నించారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాల‌ని... మూడు రాజ‌ధానులు అవ‌స‌రం లేద‌ని ప్ర‌వాసాంధ్రులు నినాదించారు. ప్ర‌త్యేకంగా బడ్జెట్ నుంచి ఎలాంటి కేటాయింపులు చేయ‌కుండా... కేవ‌లం సెల్ఫ్ ఫైనాన్స్‌తో విశ్వన‌గ‌ర నిర్మాణానికి చంద్ర‌బాబు నాంది ప‌ల‌క‌డం అభినంద‌నీయం అని అన్నారు. భ‌విష్య‌త్తులో రాజ‌ధాని న‌గ‌రం అభివృద్ది ప‌థంలో న‌డిస్తే భూములు ఇచ్చిన రైతుల బిడ్డ‌ల‌కే కాకుండా యావ‌త్‌ అమ‌రావ‌తి ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ప్ర‌వాసులు పేర్కొన్నారు. క‌నుక గ‌త 200 రోజులుగా రాజధాని కోసం పోరాడుతున్న రైత‌న్న‌ల‌కు త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కువైట్‌లోని ఎన్నారైలు చెప్పారు. ఈ సంద‌ర్భంగా వారు 'వ‌న్ స్టేట్‌.. వ‌న్ క్యాపిట‌ల్' అంటూ నినాదించారు. 

Updated Date - 2020-07-04T18:41:57+05:30 IST