కుబేర ప్రపంచంలో తెలుగు వెలుగులు

ABN , First Publish Date - 2021-04-07T05:52:44+05:30 IST

కరోనా సంక్షోభ కాలంలోనూ ప్రపంచ కుబేరుల చిట్టా భారీగా పెరిగిందని.. సంపన్నులు మరింత సంపన్నులయ్యారని ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ పేర్కొంది.

కుబేర ప్రపంచంలో  తెలుగు వెలుగులు

8 మందికి చోటు.. భారత్‌ నుంచి మొత్తం140 మంది


 దేశంలో అత్యంత సంపన్నుడు ముకేశే..

 ప్రపంచ టాప్‌-10లోనూ అంబానీకి చోటు

 అమెజాన్‌ అధిపతి బెజోస్‌ వరల్డ్‌ నం.1

 2021 రిచ్‌ లిస్ట్‌ విడుదల చేసిన ఫోర్బ్స్‌ 


కరోనా సంక్షోభ కాలంలోనూ ప్రపంచ కుబేరుల చిట్టా భారీగా పెరిగిందని.. సంపన్నులు మరింత సంపన్నులయ్యారని ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ పేర్కొంది. 2021 సంవత్సరానికిగాను ఫోర్బ్స్‌ ప్రపంచ బిలియనీర్ల జాబితా విడుదలైంది. ఈసారి 2,755 మందికి స్థానం లభించింది. గత ఏడాది లిస్ట్‌తో పోలిస్తే 660 మంది అధికం. అంతేకాదు, 2021 లిస్ట్‌లో కొత్తగా 493 మందికి చోటు దక్కింది.


అంటే, గడిచిన ఏడాది కాలంలో ప్రతి 17 గంటలకో కొత్త బిలియనీర్‌ పుట్టుకొచ్చాడన్నమాట. కనీసం బిలియన్‌ డాలర్ల (100 కోట్ల డాలర్లు=రూ.7,300 కోట్లు) సంపద కలిగిన వారికి ఫోర్బ్స్‌ ఈ లిస్ట్‌లో స్థానం కల్పించింది. ఈ ఏడాది జాబితాలో చోటు దక్కిన బిలియనీర్ల మొత్తం సంపద 13.1 లక్షల కోట్ల డాలర్ల (రూ.956.3 లక్షల కోట్లు)కు పెరిగింది. గత ఏడాది లిస్ట్‌లోని వారి మొత్తం సంపద 8 లక్షల కోట్ల డాలర్ల కంటే చాలా అధికం. ఈసారి జాబితాలోని 86 శాతం మంది సంపద గత ఏడాది కంటే పెరిగింది. ఫోర్బ్స్‌ 35వ వార్షిక బిలియనీర్ల జాబితాలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


 


ఈసారి భారత్‌ నుంచి మొత్తం 140 మందికి ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చోటు దక్కింది. గత ఏడాది  102 మందికే చోటు లభించింది. ఈసారి జాబితాలోని భారత బిలియనీర్ల మొత్తం సంపద 59,600 కోట్ల డాలర్లకు పెరిగింది. దేశంలోని టాప్‌ 3 ధనవంతుల సంపదే 100 కోట్ల డాలర్లకు పైగా పెరిగింది. 


 ప్రపంచంలో అత్యధిక మంది కుబేరులున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 


 భారత కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో కొనసాగారు. ఆసియా కుబేర కిరీటమూ ఆయనదే. 8,450 కోట్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో అంబానీ ప్రపంచ టాప్‌-10 ధనవంతుల్లో ఒకరుగా ఉన్నారు. 


 అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు దేశీయ కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే అదానీల సంపద 4,200 కోట్ల డాలర్ల మేర పెరిగింది. 

 

భారత్‌ నుంచి కొత్తగా 19 మందికి ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చోటు దక్కింది. గతంలో చోటు కోల్పోయిన 19 మంది ఈసారి మళ్లీ స్థానం సంపాదించుకోగలిగారు. 




 భారత సంపన్నుల్లో 8 మంది తెలుగువారు. అందులో 5 మంది ఫార్మా రంగానికి చెందినవారే కావడం విశేషం. 


తెలుగు సంపన్నులు 

ప్రపంచ                                                                సంపద       

ర్యాంకింగ్‌      పేరు      కంపెనీ   (రూ.కోట్లు)

384   మురళీ దివీ, కుటుంబం దివీస్‌ ల్యాబ్స్‌ 49,640

1008  పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి అరబిందో ఫార్మా 21,900

1931   పీపీ రెడ్డి      ఎంఈఐఎల్‌   11,680

2035      పీవీ కృష్ణా రెడ్డి           ఎంఈఐఎల్‌ 10,950



2035    ప్రతాప్‌ సీ రెడ్డి అపోలో హాస్పిటల్స్‌ 10,950

2035      సతీష్‌ రెడ్డి డాక్టర్‌ రెడ్డీస్‌  10,950



2378       జీవీ ప్రసాద్‌ డాక్టర్‌ రెడ్డీస్‌ 8,760

2524 ఎం సత్యనారాయణ రెడ్డి ఎంఎ్‌సఎన్‌ ఫార్మా  8,030



భారత టాప్‌-10 కుబేరులు 

10 ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌           6,16,850



24 గౌతమ్‌ అదానీ, కుటుంబం   అదానీ గ్రూప్‌                     3,68,650

71 శివ్‌ నాడార్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 1,71,550

117 రాధాకిషన్‌ దమానీ డీమార్ట్‌                     1,20,450

121 ఉదయ్‌ కోటక్‌ కోటక్‌ మహీంద్రా 1,16,070

140 పల్లోంజీ మిస్త్రీ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ 1,06,580

168 కుమార మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్‌ 93,440

169 సైరస్‌ పూనావాలా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 92,710

203 దిలీప్‌ సంఘ్వీ సన్‌ఫార్మా 79,570

213 సునీల్‌ మిట్టల్‌, కుటుంబం  భారతీ ఎయిర్‌టెల్‌ 76,650



ప్రపంచ టాప్‌- 5 ధనవంతులు   

 1 జెఫ్‌ బెజోస్‌ అమెజాన్‌ 12,92,100

 2 ఎలాన్‌ మస్క్‌ టెస్లా 11,02,300

 3 బెర్నార్డ్‌ అర్నాల్ట్‌  లూయీ విట్టన్‌ 10,95,000

 4 బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ 9,05,200

 5 మార్క్‌ జుకెర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ 7,08,100


Updated Date - 2021-04-07T05:52:44+05:30 IST