అమెరికాలో తెలుగమ్మాయి ఘనత

ABN , First Publish Date - 2020-10-20T10:41:36+05:30 IST

కరోనాకు చికిత్స విధానాన్ని కనుగొన్న 14 ఏళ్ల తెలుగు బాలిక అనికా చేబ్రోలు అమెరికాలో రూ.18.33 లక్షల(25 వేల అమెరికా డాలర్లు) బహుమతి గెలుచుకుంది. 3ఎం చాలెంజ్‌ సంస్థ నిర్వహించిన యంగ్‌ సైంటిస్ట్‌ చాలెంజ్‌లో అనికా.. కరోనా చికిత్సలో సార్స్‌-కోవ్‌-2 ప్రొటీన్‌ను కట్టిపడేసే అణువును ఇన్‌-సిలికో మెథడాలజీ ద్వారా కనిపెట్టింది.

అమెరికాలో తెలుగమ్మాయి ఘనత

  • కరోనా చికిత్సపై పరిశోధనకు రూ.18.33 లక్షల బహుమతి

హ్యూస్టన్‌, అక్టోబరు 19: కరోనాకు చికిత్స విధానాన్ని కనుగొన్న 14 ఏళ్ల తెలుగు బాలిక అనికా చేబ్రోలు అమెరికాలో రూ.18.33 లక్షల(25 వేల అమెరికా డాలర్లు) బహుమతి గెలుచుకుంది. 3ఎం చాలెంజ్‌ సంస్థ నిర్వహించిన యంగ్‌ సైంటిస్ట్‌ చాలెంజ్‌లో అనికా.. కరోనా చికిత్సలో సార్స్‌-కోవ్‌-2 ప్రొటీన్‌ను కట్టిపడేసే అణువును ఇన్‌-సిలికో మెథడాలజీ ద్వారా కనిపెట్టింది. ఈ విధానం కొవిడ్‌కు శక్తిమంతమైన చికిత్సగా గుర్తించిన 3ఎం చాలెంజ్‌ సంస్థ అనికాకు మెంటర్‌గా డాక్టర్‌ మహ్ఫూజా అలీని నియమించింది. ఆయన సాయంతో అనికా ఈ వేసవిలో తన పరిశోధనను పూర్తి చేసింది. టెక్స్‌సలోని ఫ్రిస్కోలో 8వ తరగతి చదువుతున్న అనికా గత ఏడాది తీవ్రమైన జ్వరంతో బాధపడింది. దీంతో ఇన్‌ఫ్లుయెంజాకు మందు కనుక్కోవాలని నిర్ణయించుకుంది. కొవిడ్‌ కల్లోలం తర్వాత తన దృష్టిని కరోనా వైరస్‌ నిర్మూలనపై పెట్టింది. 


Updated Date - 2020-10-20T10:41:36+05:30 IST