తెలుగు మహిళ నాయకురాలు అనంతలక్ష్మి హౌస్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-08-17T05:50:11+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖ వచ్చిన నేపథ్యంలో తెలుగు మహిళ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిని ముంస్తుగా గాజువాక పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

తెలుగు మహిళ నాయకురాలు అనంతలక్ష్మి హౌస్‌ అరెస్ట్‌
గృహ నిర్బంధంలో ఉన్న సర్వసిద్ధి అనంతలక్ష్మి

అక్కిరెడ్డిపాలెం, ఆగస్టు 16: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖ వచ్చిన నేపథ్యంలో తెలుగు మహిళ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిని ముంస్తుగా గాజువాక పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఉదయం  అక్కిరెడ్డిపాలెంలోని ఆమె ఇంటికి వచ్చిన పోలీసులు టీడీపీ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం పర్యటన నేపథ్యంలో హౌస్‌ అరెస్టు చేస్తున్నట్టు అనంతలక్ష్మికి తెలిపి ఆమె ఇంటి వద్ద మధ్యాహ్నం మూడు గంటల వరకు మహిళా కానిస్టేబుల్‌ను ఉంచారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటిస్తే ప్రతిపక్ష నాయకులను గృహ నిర్బంధం చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్షం అంటే ఇంత భయమా అని ఎద్దేవా చేశారు. 


Updated Date - 2022-08-17T05:50:11+05:30 IST