Sep 22 2021 @ 00:57AM

తెలుగు డబ్బింగ్‌ షురూ

తమిళ హీరోలు విశాల్‌, ఆర్య నటించిన తాజా చిత్రం ‘ఎనిమీ’. దసరాకు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాల్‌ డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించారు. తెలుగులో తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నట్టు ఓ వీడియో విడుదల చేశారు. కథానాయికగా మృణాళినీ రవి, ప్రత్యేక పాత్రల్లో ప్రకాశ్‌రాజ్‌, మమతా మోహన్‌దాస్‌ నటించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీత దర్శకుడు.