హైదరాబాద్ సిటీ/పమిడిముక్కల : కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మండలం తాడంకి వద్ద మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత, యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు జక్కుల నాగేశ్వరరావు(46) దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎర్రగడ్డ నందన్ నగర్‌కు చెందిన నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి భార్యతో కలిసి కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామానికి మూడు రోజుల క్రితం వచ్చారు. గురువారం ఉదయం ముదినేపల్లి వెళుతూ తాడంకి వద్ద కారులోని స్టెపిన్ టైరుకు గాలి పెట్టిస్తూ ఆయన సెల్‌ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మచిలీపట్నం నుంచి విజయవాడ వెళుతున్న కారు నాగేశ్వరరావు ఢీ కొట్టింది. ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.