తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

ABN , First Publish Date - 2021-04-22T16:48:52+05:30 IST

బ్రిటన్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న ‘ఉగాది సంబరాలు 2021’ ఘనంగా జరిగాయి. అదే విధంగా సంస్థ 19వ వార్షికోత్సవ ఉత్సవాలను కూడా కార్యవర్గ సభ్యులు వైభ

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

స్కాట్లాండ్: బ్రిటన్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న ‘ఉగాది సంబరాలు 2021’ ఘనంగా జరిగాయి. అదే విధంగా సంస్థ 19వ వార్షికోత్సవ ఉత్సవాలను కూడా కార్యవర్గ సభ్యులు వైభవంగా నిర్వహించారు. సంస్థ ఛైర్మన్ మైధిలి కెంబూరి దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సాంస్కృతిక శాఖ కార్యదర్శి నిరంజన్ నూక మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో వేడుకలను అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పర్రి.. ముఖ్య అతిథిగా డాక్టర్ బాబు మోహన్‌ను ఆహ్వనించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ తన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి తెలుగు ప్రజలకు వివరించారు. అంతేకాకుండా యూకేలోని తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 


విజయ్ కుమార్ ప్రసంగిస్తూ ఈ ఏడాది తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ తరఫున నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. మదర్ డే సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఓ కార్యక్రామానికి ప్లాన్ చేస్తున్నట్టు చేప్పారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారి కోసం ఓ అవగావన సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగు ప్రజల సహకారం వల్లే తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ పలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. అనంతరం అధ్యక్షుడు శివ చింపిరి మాట్లాడుతూ బాబు మోహన్‌తో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మహిళాశాఖ కార్యదర్శి మాధవి లత దండోర మట్లాడుతూ తాము అనేక సైకిల్ ప్రాజెక్ట్‌లను తీసుకురాబోతున్నట్టు తెలిపారు. కాగా.. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ముఖ్యంగా ‘మన బడి’ పాఠశాల చిన్నారులు ‘మా తెలుగు తల్లికి’ గేయాన్ని చక్కగా ఆలపించారు. చివరిగా జనరల్ సెక్రటరీ ఉదయ్ కుమార్.. వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూడదలిచన వారు https://www.facebook.com/events/132911995369801 లింక్ ద్వారా వీక్షించవచ్చు.


Updated Date - 2021-04-22T16:48:52+05:30 IST