Abn logo
Oct 28 2021 @ 12:12PM

TAGS ఆధ్వర్యంలో ప్రవాసులకు రచన పోటీలు..

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో తెలుగు సంఘం (టీఏజీఎస్) ఆధ్యర్యంలో యూఏఎన్ మూర్తి స్మారక 4వ రచనల పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన నియమనిబంధనలను తాజాగా నిర్వాహకులు వెల్లడించారు. విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఈ కథ, కవితల పోటీలో పాల్గొనడానికి అర్హులని తెలియజేశారు. ప్రవాసులు తమ రచనలను [email protected]కు ఈ-మెయిల్ చేయాలి. రచనలు పంపించడానికి ఆఖరి తేదీ: నవంబర్ 30, 2021. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా 116 డాలర్లు, ద్వితీయ బహుమతి 58 డాలర్లు, తృతీయ బహుమతిగా 28 డాలర్లు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

షరతులు: 

* ఒక్కో విభాగానికి ఒక్క రచన మాత్రమే పంపాలి.

* రచనలు తెలుగులో మాత్రమే ఉండాలి.

* ఇండియా మినహా అమెరికా, కెనడా, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సింగపూర్, మలేసియా, తదితర దేశాలలో నివసిస్తున్న ప్రవాసులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. 

ఇతర వివరాల కోసం http://tinyurl.com/tagscontest లో చూడొచ్చు. 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...