తాకా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

ABN , First Publish Date - 2021-04-20T17:39:31+05:30 IST

తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా(తాకా) ఆధ్వర్యంలో కెనడాలో శనివారం రోజు ప్లవనామ సంవత్సర ఉగాది సంబరాలు అంతర్జాలంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రామంలో దాదాపు 500 మందిపైగా కెనడాలోని తెలుగు వా

తాకా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు

కెనెడా: తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా(తాకా) ఆధ్వర్యంలో కెనడాలో శనివారం రోజు ప్లవనామ సంవత్సర ఉగాది సంబరాలు అంతర్జాలంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రామంలో దాదాపు 500 మందిపైగా కెనడాలోని తెలుగు వారు పాల్గొని విజయవంతం చేశారు. సాంస్కృతిక కార్యదర్శి వాణి జయంతి, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ లయం ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మొదటగా వాణి జయంతి కుటుంబం జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది సంబరాలను ప్రారంభించింది. తర్వాత సభ్యులు కెనడా, భారతదేశ జాతీయ గీతాలను ఆలపించారు. టొరంటో‌లో ఉన్న తెలుగు పూజారి నరసింహాచార్యులు పంచాగ శ్రవణం చేశారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి.. తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ కష్టకాలంలో తాకా చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం తాకా వ్యవస్థాపక ఛైర్మన్ చారి సామంతపూడి.. కెనడాలో తెలుగు వారిందరికీ ఎన్నో సేవలు అందిస్తున్న అల్బెర్టా మంత్రి పాండా ప్రసాద్, సన్‌డైన్ అధినేత శ్రీధర్ ముండూరు, టొరంటో తెలుగు టైమ్స్ అధినేత సర్ధార్ ఖాన్‌కు ఉగాది పురస్కారాలు ప్రకటించి, వారి సేవలను కొనియాడారు. 


ప్రముఖ తెలుగు చలన చిత్ర గాయకుడు దినకర్ కల్వల.. తన పాటలతో అందిరినీ అలరించారు. తర్వాత చిన్నారులు మాన్వి కార్యంపూడి, సంజిత చల్ల, సీత మైలవరపు, దుర్గ మైలవరపు, ఆశ్రిత పొన్నపల్లి, పూష్ని కోట్ల, శ్రిష్టిదామెరశెట్టి, తారుణిదేసు, మేధా గేదెల, శ్రీవత్స సంక, శ్లోక కేశర్వాణి, అజయ్ మనమంగండ్ల, సంయుతగందె, సాయిశ్రీ పలివర్తి, సహస్త్ర కోట, వైభవ్య కుప్పం, రోహన్ ముటుపూరుల తదితరులు తమ పాటలు, నృత్యాలతో వీక్షలను ఉత్తేజపరిచారు. 


ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, కల్చరల్ సెక్రటరీ వాణి జయంతి, వైస్ ప్రెసిడెంట్ కల్పనా మోటూరి, కార్యదర్శి నాగేంద్ర హంసాల  మరియు ట్రస్ట్ సభ్యులు బాషా షేక్, రామ చంద్రరావు దుగ్గిన, రాఘవ్ అల్లం, రాణి మద్దెల, ప్రసన్న తిరుచిరాపల్లిని, మరియు ఇతర వ్యవస్థాపక సభ్యులు రవి వారణాసి, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, లోకేష్ చిల్లకూరు, మునాఫ్ అబ్దుల్ ను  తాకా అధ్యక్షులు  శ్రీనాథ్ కుందూరి అభినందించారు. చివరిగా ట్రస్టీ ఛైర్మన్ బాషా షేక్.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-04-20T17:39:31+05:30 IST