'తాకా' నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2021-10-13T00:00:34+05:30 IST

తెలుగు అలయెన్సస్ ఆఫ్ కెనడా (తాకా) 2021-23 కాలానికి నూతన కార్యవర్గాన్ని అక్టోబర్ 3న బ్రాంప్టన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.

'తాకా' నూతన కార్యవర్గం ఎన్నిక

బ్రాంప్టన్‌: తెలుగు అలయెన్సస్ ఆఫ్ కెనడా (తాకా) 2021-23 కాలానికి నూతన కార్యవర్గాన్ని అక్టోబర్ 3న బ్రాంప్టన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆగష్టు 25న ప్రారంభమైన తాకా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3వ తేదీన నూతన కార్యవర్గ సభ్యులను, ట్రస్ట్ బోర్డు సభ్యులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. నూతన అధ్యక్షురాలిగా మోటూరి కల్పన, ఉపాధ్యక్షుడిగా హంసల నాగేంద్రకుమార్, కార్యదర్శిగా శ్యాంసుందర్ ప్రసన్న కుమార్, కోశాధికారిగా పదిర మల్లిఖార్జున చారి ఎన్నికయ్యారు. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ మునాఫ్ ఎన్నికయ్యారు. తాకా ఫౌండర్స్ చైర్మన్‌గా రవి వారణాసిని ఎన్నుకున్నారు. వీరి పదవీకాలం 2021 నవంబర్ 16న ప్రారంభమై 2023 నవంబర్ 15తో ముగుస్తుంది. పూర్తి నూతన కార్యవర్గం వివరాలు ఇలా ఉన్నాయి. 


కార్యనిర్వహక కమిటీ

అధ్యక్షుడు- మోటూరి కల్పన

ఉపాధ్యక్షుడు- హంసల నాగేంద్ర కుమార్ 

కార్యదర్శి- శ్యాంసుందర్ ప్రసన్న కుమార్

కోశాధికారి- పదిర మల్లిఖార్జున చారి

సాంస్కృతిక కార్యదర్శి- రాజారామ మోహన్ రాయ్ పుల్లం శెట్టి

డైరెక్టర్-1 శోభా రాణి మద్దెల 

డైరెక్టర్-2 గణేష్ బాబు తెరల

డైరెక్టర్-3 అనిత సజ్జా


బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్

ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌- అబ్దుల్ మునాఫ్ 

బోర్డ్ ఆఫ్ ట్రస్టీ-1 రాఘవ అల్లం

బోర్డ్ ఆఫ్ ట్రస్టీ-2 సురేష్ కుమార్ కునా

బోర్డ్ ఆఫ్ ట్రస్టీ-3 ప్రవీణ్ పెనుబాక

బోర్డ్ ఆఫ్ ట్రస్టీ-4 వాణి జయంతి

Updated Date - 2021-10-13T00:00:34+05:30 IST