తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం

ABN , First Publish Date - 2021-10-13T01:52:01+05:30 IST

తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సంస్థల నుంచి సాయి కుమార్ ముఠా డబ్బులు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి...

తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం

హైదరాబాద్: తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సంస్థల నుంచి సాయి కుమార్ ముఠా డబ్బులు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ.10 కోట్లు కొట్టేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ సీట్స్ కార్పొరేషన్ నుంచి మరో ఐదు కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌డీలను డ్రా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు సంస్థల నుంచి సాయికుమార్ మొత్తం రూ.15 కోట్లు డ్రా చేశారు. ఏపీ సంస్థలకు సంబంధించిన డిపాజిట్లను ఐఓబీ బ్యాంక్ నుంచి బదిలీ చేశారు.  ఐఓబీ నుంచి ఏపీ మర్కంటైల్ కోపరేటివ్ సొసైటీ‌ ద్వారా నిధులు బదిలీ, విత్ డ్రా చేశారు. ఏపీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా సాయికుమార్ కాజేసినట్లుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. సాయికుమార్ ముఠాపై 2 కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీస్ రంగం సిద్ధం చేశారు. తెలుగు అకాడమీలో కొట్టేసిన 60 కోట్ల రూపాయల రికవరీ‌పై పోలీసులు దృష్టి పెట్టారు. 

Updated Date - 2021-10-13T01:52:01+05:30 IST