Abn logo
Oct 5 2021 @ 19:44PM

తెలుగు అకాడమీలో నిధులు కొల్లగొట్టిన మొత్తం ముఠా అరెస్ట్

హైదరాబాద్: తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డ ముఠా మొత్తాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి‌తో కలిసి ఫిక్స్డ్ డిపాజిట్‌ను ఈ ముఠా కొల్లగొట్టింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్,  రాజ్ కుమార్, సోమశేఖర్‌లతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలిపారు. గతంలోనూ కొన్ని ప్రభుత్వ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈ ముఠా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...