చెత్త పన్నుకు చెప్పు దెబ్బ!

ABN , First Publish Date - 2022-01-22T08:56:07+05:30 IST

చెత్త పన్నును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారనేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఎలాగైనా సరే..

చెత్త పన్నుకు చెప్పు దెబ్బ!

పాలకొల్లులో సచివాలయ అడ్మిన్‌పై తిరగబడిన  వలంటీరు

పాలకొల్లు టౌన్‌, జనవరి 21: చెత్త పన్నును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారనేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఎలాగైనా సరే.. చెత్త పన్ను వసూలు చేయాలని సచివాలయ అడ్మిన్‌ ఒత్తిడి చేయడంతో తీవ్ర అసహనానికి గురైన ఓ వలంటీరు చెప్పుతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 12వ వార్డు సచివాలయం పరిధిలోని వలంటీర్లతో శుక్రవారం వార్డు అడ్మిన్‌ గాదిరాజు శివరామరాజు సమీక్ష నిర్వహించారు. చెత్త పన్ను వసూలు చేయలేని వలంటీర్లపై మండిపడ్డారు. ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.60 చొప్పున వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వార్డు వలంటీరు గన్నాబత్తుల భాస్కర సురేశ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెత్త పన్ను అడుగుతుంటే ప్రజలు దారుణంగా తిడుతున్నారని చెప్పారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతి వలంటీరు తప్పనిసరిగా చెత్త పన్ను పూర్తి స్థాయిలో వసూలు చేయాల్సిందేనని అడ్మిన్‌ హెచ్చరించారు. తీవ్ర అసహనానికి లోనైన వలంటీరు.. అతనిపై చెప్పుతో దాడి చేశారు. దీనిపై అడ్మిన్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు సమాచారమిచ్చారు. వలంటీరుపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-01-22T08:56:07+05:30 IST