‘ఆదినారాయణరెడి ్డకి బుద్ది చెప్పండి’

ABN , First Publish Date - 2021-10-20T04:37:51+05:30 IST

దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని బద్వేలు ప్రజలు తరిమికొట్టాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆదిమూలం సురేష్‌, ఎంపీ అవినా్‌షరెడ్డి పేర్కొన్నారు.

‘ఆదినారాయణరెడి ్డకి బుద్ది చెప్పండి’

పోరుమామిళ్ల, అక్టోబరు 19: దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన ఆదినారాయణ రెడ్డిని బద్వేలు ప్రజలు తరిమికొట్టాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆదిమూలం సురేష్‌, ఎంపీ అవినా్‌షరెడ్డి పేర్కొన్నారు. పోరుమామిళ్లలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన దళిత ఆత్మీయ సమేళనంలో వారు మాట్లాడుతూ దళితులకు నాగరికత లేదని మాట్లాడే వ్యక్తికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మె ల్యే శివప్రసాద్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతా్‌పరెడ్డి, పులిసునీల్‌ పాల్గొన్నారు. 

ప్రచారాలతో నేతలు బిజీబిజీ

అట్లూరు/పోరుమామిళ్ల/బి.కోడూరు/కాశినాయన/బద్వేలు రూరల్‌, అక్టోబరు 19: బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌, వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు బిజీబిజీగా గడుపుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి బీజేపీ అభ్యర్థి సురే్‌షను గెలిపించాలని కోరుతూ అట్లూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోరుమామిళ్ల మండలం కాల్వకట్ట, కొర్రపాటిపల్లె, ముసలరెడ్డిపల్లె ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కమలమ్మ భర్త ప్రభాక ర్‌తో కలిసి, బి.కోడూరు మండలం  ప్రభలవీడులో కడప పార్లమెంట రీ ఇన్‌చార్జ్‌ అగంపల్లె శ్రీరాములు ఎన్నికల ప్రచారం చేశారు.

కాశినాయనమండలం పిట్టిగుంట ఓబుళాపురం గ్రామాల్లో గుండ్లకుంట రామసుబ్బారెడ్డి మండల కన్వీనర్‌ విశ్వనాధ్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించా రు. కుల, మత, పార్టీలకు అతీతంగా వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధను గెలిపించాలని ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ మరకా శివకృష్ణారెడ్డియాదవ్‌ పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

Updated Date - 2021-10-20T04:37:51+05:30 IST