Whatsapp: వాట్సప్‌పై టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడి షాకింగ్ కామెంట్స్.. వాట్సప్ యూజర్లు...

ABN , First Publish Date - 2022-10-07T23:19:59+05:30 IST

టెలిగ్రామ్ (Telegram) వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్ (Pavel Durov) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ (Whatsapp)కు దూరంగా ఉండాలని టెలిగ్రామ్ యూజర్లను ఆయన కోరారు.

Whatsapp: వాట్సప్‌పై టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడి షాకింగ్ కామెంట్స్.. వాట్సప్ యూజర్లు...

టెలిగ్రామ్ (Telegram) వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్ (Pavel Durov) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ (Whatsapp)కు దూరంగా ఉండాలని యూజర్లను ఆయన కోరారు. వాట్సప్ ఒక నిఘా సాధనమని, వినియోగదారుల డేటాను రిస్క్‌లో పెడుతోందని ఆరోపించారు. గత నెలకు సంబంధించిన వాట్సప్ వెల్లడించిన డేటాలో సెక్యూరిటీ ఇష్యూలను ఆయన ప్రస్తావించారు. ఒక్క వాట్సప్ మినహా ఇతర మెసేజింగ్ యాప్‌లు వేటినైనా ఉపయోగించవచ్చునని సూచించారు.


వాట్సప్ యూజర్ల ఫోన్లను హ్యాకర్లు సులభంగా యాక్సెస్ చేసుకోగలరని ఒక టెలిగ్రామ్ మెసేజ్‌లో పావెల్ డురోవ్ పేర్కొన్నారు. గత 13 ఏళ్లుగా యూజర్ల డేటా వాట్సప్ పర్యవేక్షణలో ఉంటోందని, వాట్సప్‌లో ఉన్న లోపాలు ఉద్దేశపూర్వకంగా ఉంచినవేనని పావెల్ పేర్కొన్నారు. ఈ ఉద్దేశపూర్వక దొంగదారులను ఉపయోగించుకుని ప్రభుత్వాలు, చట్టబద్ధ సంస్థలు, హ్యాకర్లు ఎన్‌క్రిప్టెడ్ మెసేజులను కూడా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయని, భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నారని పేర్కొన్నారు. ‘‘ ఈ ప్రపంచంలో మీరెంత సంపన్నులనేది విషయమే కాదు. వాట్సప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే.. మీ ఫోన్‌లోని డేటా మొత్తం యాక్సెస్‌బుల్ అని గుర్తుంచుకోండి’’ అని పావెల్ హెచ్చరించారు.

Updated Date - 2022-10-07T23:19:59+05:30 IST