టెలిగ్రామ్‌ లోనూ గుట్టురట్టు!

ABN , First Publish Date - 2021-02-20T06:25:00+05:30 IST

మెస్సేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’ నుంచి రహస్య సందేశాలు, ఫొటోలు, వీడియోలను పాచ్డ్‌ ఫ్లా(కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లో మార్పుల సెట్‌) సహాయంతో తెలుసుకోవచ్చు. ఇటలీకి చెంది ‘షీల్డర్‌’ ఐఔస్‌, ఆండ్రాయిడ్‌, మాక్‌ఔస్‌ వెర్షన్‌ యాప్‌ల్లో దీన్ని కనుగొంది

టెలిగ్రామ్‌ లోనూ గుట్టురట్టు!

మెస్సేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’ నుంచి రహస్య సందేశాలు, ఫొటోలు, వీడియోలను పాచ్డ్‌ ఫ్లా(కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లో మార్పుల సెట్‌) సహాయంతో తెలుసుకోవచ్చు. ఇటలీకి చెంది ‘షీల్డర్‌’ ఐఔస్‌, ఆండ్రాయిడ్‌, మాక్‌ఔస్‌ వెర్షన్‌ యాప్‌ల్లో దీన్ని కనుగొంది. మాల్‌ఫార్మ్‌డ్‌ స్టిక్కర్లను అంతగా అనుమానించని వినియోగదారులకు పంపి మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలను తస్కరిస్తున్నారు. ఒకరకంగా చిన్న విషమైనప్పటికీ ఇది ఎలా పక్కదారిపడుతోందో చెప్పలేమని షీల్డర్‌ తెలిపింది.  ఈ వ్యవహారం బైటపెట్టేందుకు 90 రోజులు వేచి చూశామని, డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకునేందుకు తగు సమయం ఇచ్చామని ‘షీల్డర్‌’ వెల్లడించింది. కొత్త ఫీచర్లు ముఖ్యంగా యానిమేటెడ్‌ స్టిక్కర్లను విడుదల చేసేటప్పుడు క్రమం తప్పకుండా సెక్యూరిటీ రివ్యూ చేస్తూ ఉండాలని ఈ నేపథ్యంలో రీసెర్చర్లు సూచిస్తున్నారు. 

Read more