ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం

ABN , First Publish Date - 2022-05-22T05:58:02+05:30 IST

ఏడేళ్ల ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో తెలంగాణ రాష్ట్రం సస్య శ్యామలంగా మారిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం
పెగడపల్లి మండలం దోమలకుంటలో జలహితం ప్రారంబిస్తున్న మంత్రి ఈశ్వర్‌

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పెగడపల్లి మండలంలో రెండో విడుత జలహితం ప్రారంభించిన మంత్రి కొప్పుల

పెగడపల్లి, మే 21 : ఏడేళ్ల ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో తెలంగాణ రాష్ట్రం సస్య శ్యామలంగా మారిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పెగడపల్లి మండలంలోని దోమలకుంటలో జలహితం-జనహితం రెండో విడుత కార్యక్రమాన్ని శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ముఖ్య అతిథిగా హాజరై కాలువల పూడికతీత మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో 50 ఏండ్లుగా చెరువుల మరమ్మతు గూర్చి పట్టించుకోకపోగా ఈ ప్రాంత రైతాంగం సా గునీటి కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత రైతాంగ శ్రేయస్సు కోసం ప్రాజెక్టుల నిర్మాణం చే పట్టడంతో పాటు 46 వేల చెరువులను పూడికతీత, మరమ్మతు పనులు పూర్తి చేసుకున్నామన్నారు. తద్వారా 40 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల ట న్నుల ధాన్యం దిగుబడితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందించారు. నందగిరి లో అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి, దోమలకుంటలో కోటి రూపాయలతో నిర్మించే రోడ్డు పనులకు, బతికెపల్లిలో ఆరున్నర కోట్ల రూపాయలతో ని ర్మించనున్న రెండు బ్రిడ్జిల నిర్మాణాలకు మంత్రి శంఖుస్థాపనలు చేశారు. కార్యక్రమాలలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌ రావు, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, గోళి సురెందర్‌ రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ తిరుపతి నాయక్‌, విండో చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, సర్పంచులు రాకేశ్‌, నిహారిక, శోభారాణి, అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  ఆనందం పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:58:02+05:30 IST