ఘనంగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2021-09-30T22:50:27+05:30 IST

ఏర్పడి పదిహేను సంవత్సరాలు చేసుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి.

ఘనంగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

నిజామాబాద్: ఏర్పడి పదిహేను సంవత్సరాలు చేసుకున్న తెలంగాణ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తేజ పరిచే విధంగా చైతన్యవంతంగా మారాలని, ఆధునిక సమాజంలో టెక్నాలజీ గ్లోబలైజేషన్ అయిందని అన్ని విభాగాల విద్యార్థులు దాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. బడుగు బలహీన వెనుకబడిన మైనార్టీ పేద విద్యార్థులు కొరకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఉన్నత విద్యా వంతులు గా తీర్చిదిద్దడానికి  విశ్వవిద్యాలయాలను దేవాలయాలుగా మార్చి మీకు విద్యాబుద్ధులు అందిస్తుందని అన్నారు. నేటి సమాజంలో ప్రపంచవ్యాప్తంగా  ధనవంతులు అయిన వారిలో తొంభై శాతం పేదవారేనని వారిని చూసి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 


లక్ష్యసాధనతో చదివి ఉన్నత ప్రయోజనాలు సాధించి దేశ ప్రయోజనాలు కాపాడినవారవుతారని, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విజ్ఞానంతో పాటు చదువులు లక్ష్య సాధనే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పఢి పదిహేను సంవత్సరాలు గడుస్తున్నందున ఇక్కడ చదివే విద్యార్థులు ఎన్నో రంగాల్లో రాణించాలని తాను ఆకాంక్షిస్తున్నానని, దేశంలోని  అన్ని విశ్వవిద్యాలయాల కంటే టాప్ టెన్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే ఆలోచనలో అధ్యాపకులు ఉండాలని కోరారు. విశ్వవిద్యాలయాంలో అధ్యాపకులు నాణ్యమైన విద్యను అందించి  సర్వోన్నత  విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని అభిలషించారు. 


వివిధ విభాగాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాలల సౌత్ క్యాంపస్ బిక్నూర్ లో విద్యా బోధన చేస్తున్న ఉత్తమ ఇరవై మంది అధ్యాపకులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి సన్మానించారు. ఈ సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కనకయ్య , జిల్లా అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా,  ఆర్డీవో రవి,  ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ అన్ని విభాగాల అధిపతులు విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-30T22:50:27+05:30 IST