వడ్ల కొనుగోళ్లపై.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-04-12T23:47:17+05:30 IST

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోలుపై..

వడ్ల కొనుగోళ్లపై.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోలుపై సాధ్యాసాధ్యాలపై కేబినెట్ భేటీలో చర్చించిన మంత్రులు.. చివరకు ప్రభుత్వమే కొనాలని నిర్ణయానికి వచ్చారు. 


కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వరి వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల యుద్ధం సాగింది. కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి తెలంగాణ వడ్లు మొత్తం కేంద్రప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. ఇటు బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు దిగారు. వడ్ల విషయంలో టీఆర్ఎస్ సర్కార్ డ్రామాలడుతోందని విమర్శలు చేశారు. రా రైస్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-04-12T23:47:17+05:30 IST