రమణకే మళ్లీ టీడీపీ టీఎస్‌ పగ్గాలు

ABN , First Publish Date - 2020-10-20T09:53:05+05:30 IST

తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సారథ్య బాధ్యతలు ఎల్‌. రమణకే మరోసారి దక్కాయి. దీంతో ఆయన వరుసగా ...

రమణకే మళ్లీ టీడీపీ టీఎస్‌ పగ్గాలు

  • రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని

హైదరాబాద్‌, అక్ట్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సారథ్య బాధ్యతలు ఎల్‌. రమణకే మరోసారి దక్కాయి. దీంతో ఆయన వరుసగా మూడోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయిన ట్లయ్యింది. దివంగత నేత నందమూరి హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని రాష్ట్రపార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. మొత్తం 31 మంది సభ్యులతో టీడీపీ టీఎస్‌ కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం ప్రకటించారు.   


కేంద్ర కమిటీలో 10 మందికి చోటు

పొలిట్‌బ్యూరోలో సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డికి మళ్లీ అవకాశం దక్కగా, అరవింద్‌గౌడ్‌ను కొత్తగా నియమించారు. కొత్తకోట దయాకర్‌రెడ్డి, బక్కని నర్సింలు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, తెలుగు మహిళ అధ్య్యక్షురాలు జ్యోత్స్న, ప్రేమ్‌కుమార్‌ జైన్‌, నన్నూరి నర్సిరెడ్డి కేంద్ర అధికార ప్రతినిధులుగా, బంటు వెంకటేశ్వర్లు క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, చిలువేరు కాశీనాథ్‌ను కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులుగా నియమించారు. 


పార్టీ రాష్ట్ర కమిటీ 

ఎల్‌. రమణ (అధ్యక్షుడు), నందమూరి సుహాసిని, లక్ష్మణ్‌ నాయక్‌ రమావత్‌, అలీ మస్కతీ, సామ భూపాల్‌రెడ్డి, డి. శ్రీశైలం, బండి పుల్లయ్య, గుండు సావిత్రమ్మ, గట్టు ప్రసాద్‌, గంధం గురుమూర్తి, డాక్టర్‌ వాసిరెడ్డి రామనాథం, ఎండీ తాజుద్దీన్‌, కాట్రగడ్డ ప్రసూన (ఉపాధ్యక్షులు), జక్కిలి ఐలయ్యయాదవ్‌, ఎ.కె. గంగాధర్‌రావు, గడ్డి పద్మావతి, అజ్మీరా రాజునాయక్‌, గన్నోజు శ్రీనివాసచారి, ప్రదీప్‌ చౌదరి, జి.వి.జి.నాయుడు, మహమ్మద్‌ ఆరిఫ్‌, తల్లూరి జీవన్‌ (ప్రధాన కార్యదర్శులు), ఎన్‌. దుర్గాప్రసాద్‌, గుండు భూపేశ్‌, చావా కిరణ్మయి, కరణం రామకృ ష్ణ, జాటోత్‌ ఇందిర, మాదాడి శ్రీనివాసరెడ్డి, ఎం. రామేశ్వరరావు, శ్రీనివాస నాయుడు, అల్లూరి రాజారెడ్డి (అధికార ప్రతినిధులు).  కాగా, వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేల పరిహారం చెల్లించాలని ఎల్‌. రమణ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-20T09:53:05+05:30 IST