తెలంగాణను టూరిస్ట్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2021-07-27T08:53:48+05:30 IST

తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు. సోమవారం ఢిల్లీలో నామా నాగేశ్వరరావు, బండా ప్రకాశ్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, కవిత, పసునూరి దయాకర్‌, రాములు, లింగయ్య యాదవ్‌లు విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణను టూరిస్ట్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలి

కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ఎంపీల వినతి

తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కోరారు. సోమవారం ఢిల్లీలో నామా నాగేశ్వరరావు, బండా ప్రకాశ్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, కవిత, పసునూరి దయాకర్‌, రాములు, లింగయ్య యాదవ్‌లు విలేకరులతో మాట్లాడారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని నామా అన్నారు. బండా ప్రకాశ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కృషి వల్లనే రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. కవిత మాట్లాడుతూ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న రామప్పకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉందని అన్నారు. రామప్ప దర్శనానికి దేశవిదేశాల పర్యాటకులు వస్తారని, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పారు.

Updated Date - 2021-07-27T08:53:48+05:30 IST