తెలంగాణ సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-04-01T00:03:10+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి.

తెలంగాణ సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా.. తెలంగాణ సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ విభాగంలో పని చేస్తున్న ఓ సెక్షన్ ఆఫీసర్ కరోనా సోకింది. ఇటీవలే ఢిల్లీ ప్రార్థనలకు ఆ ఆఫీసర్ వెళ్లొచ్చారు. దీంతో ఆ ఉద్యోగిని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సచివాలయం ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఉద్యోగికి పాజిటివ్ రావడంతో సచివాలయం (బిఆర్కే భవన్) మొత్తం సిబ్బందితో శానిటేషన్ చేయించారు.


దక్షిణ ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ ప్రాంతంలో జరిగిన మత సదస్సులో పాల్గొని వచ్చిన వారిలో కలవరం మొదలైంది. ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్‌’గా తేలిన వారిలో చాలామంది ఢిల్లీలో జరిగిన సదరు మత సదస్సుకు హాజరైన వారే. కాగా.. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు/వారి ద్వారా ఇతరులకు కలిపి ఏడెనిమిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఇదివరకే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-04-01T00:03:10+05:30 IST