తెలంగాణ నాటక రంగ చరిత్ర మహోజ్వలం

ABN , First Publish Date - 2022-07-07T00:36:29+05:30 IST

తెలంగాణ నాటక రంగ చరిత్ర మహోజ్వలమని, తెలంగాణ నాటక రంగ వైభవాన్ని పునర్నిర్మించుకునేందుకు స్వరాష్ట్రంలో క`షి ప్రారంభమైందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అన్నారు

తెలంగాణ నాటక రంగ చరిత్ర మహోజ్వలం

హైదరాబాద్: తెలంగాణ నాటక రంగ చరిత్ర మహోజ్వలమని, తెలంగాణ నాటక రంగ వైభవాన్ని పునర్నిర్మించుకునేందుకు స్వరాష్ట్రంలో క`షి ప్రారంభమైందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అన్నారు. బుధవారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో ప్రముఖ సాహితీవేత్త తాటికొండాల నరసింహారావు రాసిన ‘తెలంగాణ నాటక రంగ చరిత్ర’ గ్రంధాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల వల్ల ఇక్కడి నాటక రంగానికి సంబంధించిన సమాచారం దొరకకపోవడం వల్ల తెలంగాణలో నాటకం లేదనడం సరికాదన్నారు. తెలంగాణలో అన్ని రంగాలతో పాటుగా సాహిత్య, సాంస్క`తిక పునర్నిర్మాణం కూడా వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. 


తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణలో నాటక రంగానికి సంబంధించిన సమగ్ర చరిత్రను, ప్రతిష్టాత్మకమైన నాటకాలను, నాటికలను పునర్ముద్రించవలసిన అవసరం వుందన్నారు. చరిత్ర అంటే సగం రాసిన వాక్యమని, అయితే దానికి సమగ్ర రూపం తెచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. చారిత్రకమైన ఆధారాలను వెతికి పట్టుకుని అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ తెలంగాణ నాటక రంగ చరిత్ర రాసిన నరసింహారావు అభినందనీయుడని అన్నారు.నాటక రంగానికి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ నాటక రంగ చరిత్రను తయారు చేయడం అపూర్వమని ప్రఖ్యాత విమర్శకుడు, నాటక రంగ నిపుణుడు సంగనభట్ల నరసయ్య కొనియాడారు. 

Updated Date - 2022-07-07T00:36:29+05:30 IST