‘‘మన ఊరు-మన చరిత్ర’’కు కార్యరూపం: Juluru Gowri shankar

ABN , First Publish Date - 2022-06-06T23:08:41+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక ఆలోచనల మేరకు తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మన ఊరు – మన చరిత్ర” అనే కార్యక్రమానికి విస్తృత ఆచరణ రూపం ఇచ్చేందుకు సోమవారం నాడు తెలంగాణ సాహిత్య అకాడమి(telangana sahitya academy) ఛైర్మన్ జూలూరు గౌరీ శంకర్(juluru gowrishankar) కాలేజియేట్ కమిషనర్ నవీన్ మిట్టల్(naveen mittal) తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు

‘‘మన ఊరు-మన చరిత్ర’’కు కార్యరూపం: Juluru Gowri shankar

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక ఆలోచనల మేరకు తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మన ఊరు – మన చరిత్ర” అనే కార్యక్రమానికి విస్తృత ఆచరణ రూపం ఇచ్చేందుకు సోమవారం నాడు తెలంగాణ సాహిత్య అకాడమి(telangana sahitya academy) ఛైర్మన్ జూలూరు గౌరీ శంకర్(juluru gowrishankar) కాలేజియేట్ కమిషనర్ నవీన్ మిట్టల్(naveen mittal) తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని డిగ్రీ విద్యార్ధులతో వారి వారి గ్రామాల చరిత్రను అ ఊరి విద్యార్ధుల చేతులతోనే రాయించేదుకు సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అన్నీ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్, తెలుగు చరిత్ర శాఖల విభాగాల అధ్యాపకుల చేత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.ఈ సందర్భంగా మార్గదర్శకాలను రూపొందించాలని గ్రామ నామాల చరిత్ర దగ్గర నుంచి, నేటి పల్లె, పట్టణ ప్రగతి వరకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తామని అన్నారు. గ్రామంలోని దేవాలయాలు, చర్చీలు, మసీదులు అందుకు సంబంధించిన వాటి చరిత్రను రాస్తారు.


గ్రామంలోని వృక్ష సంపద, వందల ఏళ్ల నాటి చెట్లను, పుట్టలను, గుట్టలను అద్భుతమైన పర్యావరణ సౌందర్యాన్ని ఇందులో పొందుపరుస్తారు. తమ గ్రామంలో ఉన్న జల సంపదను చెరువులను, కాలువలను తమ గ్రామానికి ఆనుకుని ప్రవహిస్తున్న నదులను, ఏరులను అక్షరీకరిస్తారు. తమ ఊర్లో పండే పంటల దగ్గర నుంచి పండ్ల తోటల వరకు అన్ని విషయాలను వివరిస్తారని అన్నారు. గ్రామంలోని పురాతన విగ్రహాలను, శాసనాలను, తమ గ్రామంలో దొరికే తాళపత్ర గ్రంథాలను, పురాతన వస్తువులను తర తరాలుగా వాడుతున్న వ్యవసాయ పని ముట్లను ఆధారాలతో సహా వెలికితీస్తారు. తమ గ్రామంలో ఉన్న సంప్రదాయ కళలను, కళా రూపాలను, కళా కారుల చరిత్రను రికార్డు చేస్తారు. నాట్లేసేటప్పుడు కూలీ తల్లులు పాడుకునే పాటలను జానపద కళా సంపదలను కూడా పొందుపరుస్తారని అన్నారు.


తర తరాలుగా పూజింప బడుతున్న పోతరాజు, ముత్యాలమ్మ, మైసమ్మ గ్రామ దేవతల చరిత్రలను రాస్తారు. తమ ఊరు నుంచి ఎదిగివచ్చిన యోధుల, వీరుల చరిత్రలను విద్యార్ధులతో రాయిస్తామన్నారు. తమ ఊర్లలోని కవులను, రచయితలను వారి రచనలను అన్నింటినీ రికార్డు వారు చేస్తారు. తన గ్రామం కోసం జీవితాలను అంకితం చేసి పని చేసిన ప్రజా నాయకుల చరిత్రలను పేర్కొంటారు. తమ ఊరిలో ఉన్న మత సమరస్యాన్ని పేర్కొంటారు. సినిమా యాక్టర్లు, డాక్టర్లు, సంగీత దర్శకులు, ఆర్టిస్టులు, సైంటిస్టులు అందరి చరిత్ర ఇందులో ఉంటుందని తెలిపారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, తెలంగాణ విమోచన ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి, మలి దశ ఘట్టాలను, పోరులో నేలకొరిగిన వీరుల చరిత్ర దగ్గర నుంచి రాష్ట్ర సాధన కోసం పని చేసిన  అ గ్రామ నాయకుల చరిత్ర అంతా అందులో ఉంటుందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-06T23:08:41+05:30 IST