హైదరాబాద్: యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం తెలంగాణ సాహిత్య అకాడమీ(telangana sahitya academy) చైర్మన్ జూలూరు గౌరీశంకర్(juluru gowri shankar) తో అకాడమీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమి భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాలపై ఇరువురు కలిసి చర్చించారు. తెలంగాణ సాహిత్యాన్ని విస్తృతంగా స్కూలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు, చేరవేసేందుకు కృషి చేయాలని మాట్లాడారు.
ఇప్పటి వరకు వెలుగులు చూడని సాహితీ మూర్తుల చరిత్రను వెలికి తీయాలని సమాలోచన చేశారు. తెలంగాణ తేజోమూర్తులు వాళ్ళు చేసిన సేవలను ఇప్పటికే సాహిత్య అకాడమీ చాలా పుస్తకాలు గ్రంథస్తం చేయటం జరిగిందని, ఇకపై ఈ కృషిని విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి