బాలసాహిత్యంలో అక్షర విప్లవాలు: జూలూరు గౌరీశంకర్

ABN , First Publish Date - 2022-04-30T20:49:39+05:30 IST

తెలుగుసాహిత్యంలో అక్షర విప్లవాలకు తెలంగాణ నేల భూమికగా నిలవడం గర్వించదగినదని తెలంగాణ సాహిత్యం అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు

బాలసాహిత్యంలో అక్షర విప్లవాలు: జూలూరు గౌరీశంకర్

హైదరాబాద్: తెలుగు బాల సాహిత్యంలో అక్షర విప్లవాలకు తెలంగాణ నేల భూమికగా నిలవడం గర్వించదగినదని తెలంగాణ సాహిత్యం అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు సాహిత్య అకాడమీ కార్యాలయంలో శనివారం గద్వాల కిరణ్ కుమారి రాసిన ‘చంద్ర కిరణాలు’ అన్న బాల గేయాల పుస్తకాన్ని జూలూరు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలలోస`జనను తట్టిలేపేందుకు బాల సాహిత్యం ఎంతో దోహదపడుతుందన్నారు. తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా బాల సాహిత్య రచనలు విరివిగా వస్తున్నాయని, ముఖ్యంగా బాలలే బాలసాహిత్యాన్ని రాయటం పెనుమార్పుగా చెప్పాలని ఆయన పేర్కొన్నారు. 


కథారచయిత్రి, గజల్ గాయని, కవయిత్రి అయిన గద్వాల కిరణ్ కుమారి చంద్రకిరణాలులో బాలగేయాలను పిల్లల మనస్సులను హత్తుకునేలా వర్ణిస్తూ గొప్పగా రాసారని జూలూరు విశ్లేషించారు. కాళోజీ అవార్డు గ్రహీత ప్రముఖ కవి అమ్మంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఒకనాటి చందమామ పత్రికలో వచ్చిన కథలు ఆ తరంలో ఎంతో ప్రభావం చూపించాయని తెలిపారు. ప్రముఖ రచయిత్రి కొల్లాపురం విమల మాట్లాడుతూ ప్రక`తిలోని పశువులు, పక్షులు, చెట్టు, పూలు వంటి సౌందర్య భరితమైన అనేక విషయాలను హ`ద్యంగా గేయాలలో రచించారని వివరించారు. ఈ పుస్తకావిష్కరణ సభకు ప్రముఖ రచయిత్రి గోగు శ్యామల అధ్యక్షత వహించగా ప్రముఖ కవులు, రచయితలు, కాంచనల్లి, జగన్ రెడ్డి, కెపి అశోక్ కుమార్, వాసరచెట్ల జయంతి, షహనాజ్, తాయమ్మ, కరుణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-30T20:49:39+05:30 IST