గ్రామ చరిత్రల రచనలకు కేయుసి ‘సై’

ABN , First Publish Date - 2022-05-05T23:01:03+05:30 IST

తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన చరిత్రను మనం రాసుకుందా’ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం ‘సై’ అంటూ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

గ్రామ చరిత్రల రచనలకు కేయుసి ‘సై’

హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన చరిత్రను మనం రాసుకుందా’ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం  ‘సై’ అంటూ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. డిగ్రీ, పీజీ విద్యార్ధులతో ‘ తన ఊరి చరిత్ర’ను తానే రాసే విధంగా చేసి స`జనాత్మక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించేందుకు Telangana sahitya academy రూపొందించిన కార్యాచణ ప్రణాళిక పై తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ Juluru Gowri shankar, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ pro. Tatikonda Ramesh గురువారం సాహిత్యఅకాడమీ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించారు. కేయూసీ పరిదిలోని 11 జిల్లాల్లోని డిగ్రీ, పీజీ కాలేజీ విద్యార్ధుల చేత గ్రామ చరిత్రలను రాయించేందుకు విసి తాటికొండ రమేశ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బీజిఎస్ఆర్ కాలేజీ నుంచి ఈ కార్యక్రమాన్ని ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. 


తెలంగాణ సాహిత్య అకాడమీ గ్రామ చరిత్రతలను రికార్డుచేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. కాలేజీల్లో చదువుకునే విద్యార్ధుల చేత తమ గ్రామ చరిత్రలను రాయించే పనికి సిద్ధం చేయడం పట్ల కేయూసీ వీసీ తాటికొండ రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. తమ విశ్వ విద్యాలయం పరిధిలోని 11 జిల్లాల్లోని గ్రామాల చరిత్రను రాయించేందుకు తాము ముందుకు వస్తున్నామని చెప్పారు . అధ్యాయపకులు , విద్యార్ధుల సంయుక్త ఆధ్వర్యంలో కాలేజీ ప్రిన్సిపాల్స్ పర్యవేఓణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని పేర్కొన్నారు. తమ గ్రామ చరిత్రలను తామే రాసుకునే చారిత్రాత్మక పనికి భావితరమైనవిద్యార్ధులను సిద్ధం చేయడంలో చరిత్ర రచనలకు కొత్తదారి వేసినట్టయ్యిందని అకాడమీ ఛైర్మన్ గౌరీశంకర్ తెలిపారు. 


ఉన్నఊరు, కన్నతల్లి ఒకటే అని గర్వంగా చెప్పుకుంటూ తమ వూరి గొప్పతనాన్ని గ్రామ నైసర్గిక, చారిత్రక, ఆర్ధిక, సామాజిక సాంస్క`తిక సమాచారాన్ని తెలియజేసే గ్రామ కైఫియత్ లను విద్యార్ధుల చేతులతో రాయించేందుకు ముందుకు రావడం చరిత్ర రచనకు కొత్తఒరవడి అవుతుందన్నారు. ఇప్పటికే నల్లగొండలోని నాగర్జున ప్రభుత్వ డిగ్రీ , పీజీ కాలేజీ విద్యార్ధులు 200 గ్రమాల చరిత్రలను రాస్తున్నారని గౌరీశంకర్ తెలిపారు. ఇప్పటికే ఊరు తనకు తానుగా రూపొందించుకున్న చరిత్రను, వూరిలోని దేవాలయాలు, శాసనాలు, పాతనిర్మాణాలు, పరిశ్రమలు, చేతివ`త్తులు, రవాణా సదుపాయాల దగ్గర నుంచి నీటి వసతి వరకు మొత్తం గ్రామ సంస్క`తిని విద్యార్ధులు రికార్డు చేస్తారని వివరించారు. గ్రామ చరిత్ర సంస్క`తి దగ్గర నుంచి వూరు ప్రముఖుల వరకు అన్ని విషయాలు ఇందులో పొందుపరిచి రాస్తారని ఆయన తెలిపారు. 

Read more