పోతిరెడ్డిపాడుపై తెలంగాణ తీరు సరికాదు : సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-10T10:03:52+05:30 IST

శ్రీశైలం వరద జలాలను వినియోగించుకొనేందుకు వీలుగా పోతిరెడ్డిపాడు కాలువ సామర్థ్యాన్ని పెంచాలన్న ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, అక్కడి పార్టీలు

పోతిరెడ్డిపాడుపై తెలంగాణ తీరు సరికాదు : సోమిరెడ్డి

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం వరద జలాలను వినియోగించుకొనేందుకు వీలుగా పోతిరెడ్డిపాడు కాలువ  సామర్థ్యాన్ని పెంచాలన్న ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం, అక్కడి పార్టీలు అడ్డుకోవడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఏపీలో రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం. దేశంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇప్పటికే శ్రీశైలం జలాలు వినియోగించే ఆయకట్టు తగ్గింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న పట్టిసీమ, రాబోయే పోలవరం, తెలంగాణలో నిర్మించిన పలు ప్రాజెక్టుల వల్ల శ్రీశైలంలో మిగులు జలాలకు అవకాశం కలిగింది. ఆ జలాలను రాయలసీమలో వాడుకొంటామంటే అడ్డుకోవడం ఎంతవరకూ సమంజసం? సముద్రంలో వృథాగా కలిసే వరద జలాలను వాడుకొంటామంటే అడ్డుకోవడం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2020-08-10T10:03:52+05:30 IST