Abn logo
Nov 26 2021 @ 09:56AM

Telangana: నడుస్తున్న కారులో మంటలు...తప్పిన ప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా కారు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. కారు ఇంజన్‌లో నుంచి మంటలు రావడంతో  కార్ డ్రైవర్ ఇక్బాల్ అప్రమత్తమయ్యాడు.  ప్రయాణికులు వెంటనే కారులోంచి బయటకు దిగారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.