తెలంగాణలో భారీ వర్షాలు...ప్రాజెక్టులకు జలకళ

ABN , First Publish Date - 2020-08-13T16:17:22+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తున్నాయి.

తెలంగాణలో భారీ వర్షాలు...ప్రాజెక్టులకు జలకళ

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తున్నాయి.  ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారుగా వర్షం కురుస్తోంది. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కడెం, ఎల్లంపల్లి, కొమురంభీం ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో పెరిగింది. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. (మెడిగడ్డ)లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 3 లక్షల 76 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3లక్షల 99వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 57 గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మెడిగడ్డ బ్యారేజ్‌లో 9.166 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 

Updated Date - 2020-08-13T16:17:22+05:30 IST