3 రోజులు మోస్తరు వర్షాలు!

ABN , First Publish Date - 2020-04-03T07:05:09+05:30 IST

రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం...

3 రోజులు మోస్తరు వర్షాలు!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా కర్ణాటక నుంచి తెలంగాణ వరకు ఉత్తర కర్ణాటక మీదు గా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఒడిసా, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

Updated Date - 2020-04-03T07:05:09+05:30 IST