సీమకు నీళ్ళేవీ?

ABN , First Publish Date - 2020-08-12T15:01:27+05:30 IST

శ్రీశైలం నుంచి తెలంగాణ నీళ్లు తోడేస్తున్నా.. జగన్ ప్రభుత్వం..

సీమకు నీళ్ళేవీ?

శ్రీశైలం నుంచి తెలంగాణ నీళ్లు తోడేస్తున్నా.. జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం వస్తున్నా.. శ్రీశైలం నుంచి ప్రాజెక్టులకు నీరు విడుదల కావడంలేదు. ఐదు రోజుల క్రితమే డ్యామ్‌లో నీటి మట్టం 855 అడుగులకు చేరుకుంది. కరువు సీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. శ్రీశైలం జలాశయంలో తగినంత నీరు ఉన్నా రైతాంగానికి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. వచ్చిన వరదలు వచ్చినట్లు విద్యుత్ ఉత్పత్తి పేరిట తెలంగాణ తోడేస్తూ.. సాగర్‌కు మళ్లిస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఫలితంగా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీరిచ్చే పరిస్థితి కనబడడంలేదు.

Updated Date - 2020-08-12T15:01:27+05:30 IST