Abn logo
Sep 19 2021 @ 12:59PM

హీటెక్కిన తెలంగాణ రాజకీయం..

హైదరాబాద్: తెలంగాణ రాజకీయల్లో హీట్ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ ముగింపు సభ నిన్న గజ్వేల్ నియోజక వర్గంలో జరిగింది. ఆ పార్టీకి సంబంధించి కేంద్ర నాయకత్వం నుంచి మల్లికార్జున ఖర్గే సభలో పాల్గొన్నారు. దళితులు, గిరిజనులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సభలు నిర్వహించామని, ఇకపై నిరద్యోగ దీక్షలు చేయబోతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సభవేదికగా కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక విమర్శలు చేశారు.


తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ పార్టీ జాతీయ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ప్రకటించారు. ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. 17 ఎంపీ స్థానాలు గెలుస్తామంటూ అమిత్ షా ప్రకటన చేశారు.


ఈ సభలపై టీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ముఖ్యమంత్రిపై స్థాయి లేనివాళ్లు ఎవరిపడితేవాళ్లు ఎటవంటి భాష మాట్లాడాలో కూడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారని, ఇకపై సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడతామని నేతలు స్పష్టం చేశారు. నిన్నటి రెండు సభలపై, ఇవాళ టీఆర్ఎస్ నేతల కామెంట్స్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబెట్ నిర్వహించింది. ఈ వీడియో క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...