‘‘అవి గ్యాంగ్‌రేప్‌లు కావు.. కట్టు కథలు’’

ABN , First Publish Date - 2021-08-19T23:39:29+05:30 IST

హైదరాబాద్: గాంధీఆస్పత్రి, సంతోష్‌నగర్‌లో జరిగినవి గ్యాంగ్ రేప్‌లు కావని.. మహిళలు కావాలనే కట్టుకథ అల్లారని పోలీసులు తేల్చారు. మీడియాకు వారు వివరాలు వెల్లడించారు.

‘‘అవి గ్యాంగ్‌రేప్‌లు కావు.. కట్టు కథలు’’

హైదరాబాద్: గాంధీఆస్పత్రి, సంతోష్‌నగర్‌లో జరిగినవి గ్యాంగ్ రేప్‌లు కావని.. మహిళలు కావాలనే కట్టుకథ అల్లారని పోలీసులు తేల్చారు. మీడియాకు వారు వివరాలు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని..  అక్క ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో చెల్లెలు అక్కడే ఉండిపోయిందన్నారు. అక్కాచెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని చెప్పారు. చెల్లెలు కల్లు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని.. అక్క విషయాన్ని దాచిపెట్టేందుకే గ్యాంగ్ రేప్ కథ అల్లిందని తెలిపారు. వారి మానసిక పరిస్థితి సరిగా లేదని తేలిందన్నారు. 


అలాగే సంతోష్‌నగర్ గ్యాంగ్ రేప్ పూర్తిగా అభూతకల్పన అని పోలీసు అధికారులు తేల్చారు. ప్రియుడు తనని పెళ్లిచేసుకోనని చెప్పడంతో.. అతడిని కేసులో ఇరికించేందుకు ప్లాన్ వేశారని తెలిపారు. తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు రేప్ చేశారంటూ యువతి స్టోరీ అల్లిందన్నారు. రాత్రంతా చాంద్రాయణగుట్టలో తిరిగి.. రేప్ కథను తల్లికి చెప్పిందన్నారు. విచారణలో యువతి చెప్పిందంతా కట్టుకథగా నిర్ధారణ అయిందని పోలీసులు వివరించారు.

Updated Date - 2021-08-19T23:39:29+05:30 IST