KCR సార్.. ఇండియాకు రప్పించండి..!

ABN , First Publish Date - 2021-08-20T04:56:38+05:30 IST

ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ యువకుడు అక్కడ యజమాని పెడుతున్న కష్టాలు తట్టుకోలేక తనను ఇండియాకు రప్పిం చాలని దీనంగా వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే రాయికల్‌ మండలం ధర్మాజిపేట గ్రా

KCR సార్.. ఇండియాకు రప్పించండి..!

కరీంనగర్: ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన ఓ యువకుడు అక్కడ యజమాని పెడుతున్న కష్టాలు తట్టుకోలేక తనను ఇండియాకు రప్పిం చాలని దీనంగా వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే రాయికల్‌ మండలం ధర్మాజిపేట గ్రామానికి చెందిన నగావత్‌ సురేందర్‌ సౌదీలో తన యజ మాని పెడుతున్న కష్టాలు తట్టుకోలేక పోతున్నానని తనను ఇండియాకు రప్పించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లను వేడుకుంటున్నాడు. అప్పుచేసి రెండేళ్ల క్రితం సౌదీకి వెళ్లిన సురేందర్‌ అక్కడ ఫ్యామిలీ డ్రైవర్‌గా పనిలో చేరాడు.



ఆరు నెలల క్రితం అక్కడ జరిగిన ఓ ప్రమాదానికి అతనిని బాధ్యుడిని చేస్తూ అతని వద్ద నుండి యజమాని పాస్‌పోర్టు లాక్కోవడంతో పాటు 6500రియాల్స్‌ డబ్బుకూడా తీసుకున్నాడు. కరోనా వచ్చి ఇబ్బంది పడ్డానని తనను స్నేహితులు బతికించారని తెలిపాడు. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తయారైందని తాను దమామ్‌ జుబేల్‌ కమీషన్‌లో ఉంటున్నాని తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోరుతున్నా తనను ఉద్యోగంలో పెట్టుకున్న యజ మాని కేసు పెట్టుకో నేను మాత్రం పాస్‌పోర్టు ఇవ్వనని బెదిరిస్తున్నాడని తెలిపాడు. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నానని తనను ఎలాగైనా ఇండియా తీసుకువెళ్లేందుకు సహకరించాలని కోరుతున్నాడు. తనకు తల్లిదండ్రులు, భార్యా, పిల్లలు గుర్తుకు వస్తున్నారని ఎలాగైనా స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఓమి త్రుడి సహాయంతో మొబైల్‌ డాటా సపోర్ట్‌ కార్డు వేయిం చుకుని ఈవీ డియో పంపిస్తున్నాని తనకు సహకరించాలని చేతులు జోడించి వేడు కుంటున్నాడు.

Updated Date - 2021-08-20T04:56:38+05:30 IST