కాల్పులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందన

ABN , First Publish Date - 2022-08-13T22:56:28+05:30 IST

గాలిలో జరిపిన కాల్పుల వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. శ్రీనివాస్ గౌడ్ రబ్బర్ బుల్లెట్ పెల్చారని, ...

కాల్పులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందన

హైదరాబాద్: గాలిలో జరిపిన కాల్పుల వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. శ్రీనివాస్ గౌడ్ రబ్బర్ బుల్లెట్ పెల్చారని, ఈ ఘటనపై అనవసరంగా దుష్పచారం చేస్తున్నారని అన్నారు. తాను పేల్చింది నిజమైన బుల్లెట్టని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. క్రీడా మంత్రిగా, ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిగా కూడా ఆయుధాన్ని ఉపయోగించుకోవచ్చని మంత్రి అన్నారు. కాల్పుల ఘటనపై తప్పుగా రిపోర్టు చేస్తున్న వ్యక్తులు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను సంప్రదించి వాస్తవాలను తెలుసుకోవాలని, వాస్తవాలను ధృవీకరించకుండా తప్పుడు సమాచారం  చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2022-08-13T22:56:28+05:30 IST