కృష్ణస్వామి ముదిరాజ్‌ విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-08-20T12:28:26+05:30 IST

కృష్ణస్వామి ముదిరాజ్‌ విగ్రహావిష్కరణ

కృష్ణస్వామి ముదిరాజ్‌ విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ తొలి మేయర్‌ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్‌ విగ్రహావిష్కరణ శుక్రవారం జరిగింది. జూబ్లీ బస్టాండ్‌ ఎదురుగా జీహెచ్‌ఎంసీ ఏర్పాటుచేసిన విగ్రహాన్ని మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌లు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, తదితరులతో కలిసి ఆవిష్కరించారు. మేయర్‌గా కృష్ణస్వామి ముదిరాజ్‌ చేసిన సేవలను తలసానితోపాటు ముదిరాజ్‌ సంఘం నాయకులు కొనియాడారు. 


సామాజిక సేవకుడు..

హైదరాబాద్‌ స్టేట్‌లోని ఔరంగాబాద్‌లో సెప్టెంబర్‌ 2, 1893న బిజూబాయ్‌, ఎల్లయ్య ముదిరాజ్‌కు కృష్ణస్వామి జన్మించారు. 1914లో నిజాం సంస్థానంలో ప్రధానమంత్రి సర్‌ కిషన్‌ప్రసాద్‌ బహదూర్‌ వద్ద అంతరంగిక కార్యదర్శిగా పని చేశారు. 1922లో గాంధీ పిలుపునిచ్చిన ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. అదే సంవత్సరం ముదిరాజ్‌ మహాసభ స్థాపించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పిక్టోరియల్‌ హైదరాబాద్‌ గ్రంథాన్ని ఆయనకు చెందిన చంద్రకాంత ప్రెస్‌లో ముద్రించారు. 1933లో మొదటిసారి కౌన్సిలర్‌గా గెలిచారు. వరుసగా నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో విజయం సాధించి.. 25 ఏళ్లపాటు చుడీబజార్‌ కౌన్సిలర్‌గా ప్రజలకు సేవలందించారు. 1957లో ఏర్పాటైన హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు మొదటి మేయర్‌గా ఎంపికైన కృష్ణస్వామి ముదిరాజ్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. యుగోస్లేవియా అధ్యక్షుడు మార్షల్‌ టిటోకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణస్వామికి టిటో తన చేతికున్న గడియారాన్ని గుర్తుగా అందజేశారు. 1967, డిసెంబర్‌ 19న ఆయన మరణించారు. రచయితగా, పాత్రికేయుడిగా, విద్యావేత్తగా, నాయకుడిగా కృష్ణస్వామి సామాజిక సేవలో కీలకంగా వ్యవహరించారు. 

Updated Date - 2022-08-20T12:28:26+05:30 IST