శత వసంతాల సిటీ కళాశాల

ABN , First Publish Date - 2022-08-20T12:30:25+05:30 IST

శత వసంతాల సిటీ కళాశాల

శత వసంతాల సిటీ కళాశాల

ఏడాదంతా వేడుకలు : ప్రిన్సిపాల్‌           


చార్మినార్‌, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సిటీ కళాశాల శత వసంతాల వేడుకకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఏడాదంతా విద్య, సాహిత్య, వైజ్ఞానిక ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పి.బాల భాస్కర్‌ తెలిపారు. వేడుకల్లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ, కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో విద్య, కళ, సాంస్కృతిక మేళా నిర్వహిస్తామన్నారు. కళాశాల వైభవాన్ని ఈ తరానికి అందించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత విద్యా శాఖాధికారులు, జాతీయ/రాష్ట్ర స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ విద్యావేత్తలు, సుప్రసిద్ధ కవులు, కళాకారులు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు విచ్చేస్తారని వివరించారు. 25న విద్యార్థులు గీసిన జాతీయ నాయకుల, కవుల, చారిత్రక కట్టడాల చిత్రపటాలు, చారిత్రక ప్రదేశాల ఫొటో ప్రదర్శన ఉంటుందన్నారు. 26న పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం సందర్భంగా ఓపెన్‌ డే, డిజిటల్‌ పైలాన్‌ ఆవిష్కరణ, 27న బహుమతి ప్రదానం, భాషా సాంస్కృతిక శాఖ వారి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, కామన్‌ వెల్త్‌ పోటీల్లో కాంస్య పతాక విజేత బేబీ రెడ్డికి సన్మానం ఉంటాయన్నారు.

Updated Date - 2022-08-20T12:30:25+05:30 IST