బిర్యానీ తిని బాలుడు మృతి

ABN , First Publish Date - 2022-08-20T12:34:26+05:30 IST

బిర్యానీ తిని బాలుడు మృతి

బిర్యానీ తిని బాలుడు మృతి

ఆలస్యంగా వెలుగులోకి ఘటన


ఖైరతాబాద్‌, (ఆంధ్రజ్యోతి): హోటల్‌ నుంచి తెచ్చుకున్న బిర్యానీ తిని కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురికాగా ఓ బాలుడు మృతి చెందాడు. సైఫాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ మారుతీనగర్‌కు చెందిన రాంబాబు ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 13న రాత్రి లక్డీకాపూల్‌లోని ఓ రెస్టారెంట్‌ నుంచి ఈ కుటుంబం రెండు చికెన్‌ బిర్యానీలు తెచ్చుకొని  తిని పడుకున్నారు. మరుసటిరోజు మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. పక్కింటి వారు తలుపు తీసి చూడగా ఇంట్లో రాంబాబుతో పాటు భార్య త్రివేణి, కొడుకు గౌతం నంద(10), కూతురు నిహారిక అపస్మారక స్థితిలో కనిపించారు. స్థానికులు నీళ్లు చల్లగా త్రివేణి మత్తుగా లేచినా మిగతా ముగ్గురు లేవలేదు. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షించగా అప్పటికే గౌతం నంద మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాంబాబును, నిహారిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్రివేణి ఫిర్యాదు మేరకు సైఫాబాద్‌ ఎస్‌ఐ నవీన్‌ విచారిస్తున్నారు. బిర్యానీ శాంపిల్స్‌ను పరీక్షలకు పంపారు. 

Updated Date - 2022-08-20T12:34:26+05:30 IST